రేపు హుస్నాబాద్ బంద్.. హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపు

by Nagam Mallesh |
రేపు హుస్నాబాద్ బంద్.. హిందూ సంఘాల ఐక్యవేదిక పిలుపు
X

దిశ, హుస్నాబాద్ః బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన ఆకృత్యాలకు, హింసకు హిందువుల ధన, మాణ ప్రాణాలు హరించుకుపోవడాన్ని ఖండిస్తూ హుస్నాబాద్ లో శనివారం బంద్ పాటించాలని హిందూ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గౌరిశెట్టి ప్రకాష్, విశ్వహిందూ పరిషత్ భార్గవపురం (హుస్నాబాద్) ఖండ ప్రముఖ్ చందుపట్ల నాగరాజు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో చిక్కిశల్యమైన వారికి మనోధైర్యాన్ని కల్పించి అండగా నిలబడదామని తెలిపారు. అలాగే హుస్నాబాద్ పట్టణ బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి హిందువుల సంఘటిత శక్తిని నిరూపించాలని, హుస్నాబాద్ బంద్ ను విజయవంతం చేయాలని, ఇందుకుగాను పట్టణంలోని వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీల యాజమానులు స్వచ్ఛంద బందు పాటించి విజయవంతం చేయాలని కోరారు.

Next Story

Most Viewed