హెల్త్ సూపర్వైజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆశా వర్కర్లు...

by Sumithra |
హెల్త్ సూపర్వైజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆశా వర్కర్లు...
X

దిశ, చిన్నశంకరంపేట : ఆశ వర్కర్ల పై అసభ్య పదజాలాలతో దూషించిన సూపర్వైజర్ పై చర్యలు తీసుకోవాలని ఆశావర్కర్లు చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హెల్త్ సూపర్వైజర్ అనిల్ డేవిడ్, ఆశా వర్కర్ల పై బూతు మాటలు తిట్టాడని, ఆశ వర్కర్ల పై చేయి చేసుకోవడంతో వారి గాజులు పగిలిపోయాయి. అనంతరం ఆశ వర్కర్లు డాక్టర్ సాయి సింధుకు వినతిపత్రం అందించారు.

డాక్టర్ సాయిసింధు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్లో అనిల్ డేవిడ్ పై స్థానిక ఎస్ఐ నారాయణకు ఫిర్యాదు చేశారు. ఆశ వర్కర్ల పై అనుచితంగా ప్రవర్తించిన అనిల్ డేవిడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తున్నారని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని లేదంటే ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి సింధు, ఆశ వర్కర్ల మండల అధ్యక్షురాలు దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed