- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chamala Kiran Kumar Reddy: దీపావళి పార్టీలు ఇలా చేసుకుంటారా.. ఎంపీ చామల ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ (Janwada)లోని కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్(Farm House)లో రేవ్ పార్టీ వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ (Telangana Politics)లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై ఇప్పటికే పలు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో స్సందించారు. తన బావమరిది ఇంట్లో జరిగిన రేవ్ పార్టీపై కేటీఆర్ (KTR) కూడా స్పందించారు. ఇళ్లలో దావత్‌లు చేసుకోవద్దా.. చేసుకుంటే తప్పేముందంటూ కామెంట్ చేశారు.
తాజాగా, కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) ఫైర్ అయ్యారు. రేవ్ పార్టీలపై ప్రభుత్వం చెబితేనే పోలీసులు దాడి చేయరని ఆయన అన్నారు. ఫామ్‌హౌస్ ఘటన డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని ధ్వజమెత్తారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఎంత పెద్దవారు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని తెలిపారు. కేటీఆర్ (KTR) చెప్పినట్లుగా దీపావళి (Diwali) పార్టీలు ఇలా ఎవరూ చేసుకోరని కామెంట్ చేశారు. ఒకవేళ పార్టీ చేసుకుంటే ఎక్సైజ్ శాఖ (Excise Department) అనుమతి తీసుకోవాలని తెలియదా అని మండిపడ్డారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఒకరికి డ్రగ్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ (Positive Report) వచ్చిందని గుర్తు చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో 111 జీవోను ఎత్తేసి ఆ పార్టీ నాయకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. గతంతో కూడా రాజ్ పాకాల (Raja Pakala) ఈవెంట్స్ నిర్వహించారని పేర్కొన్నారు. సన్ బర్న్ (Sun Burn) లాంటి పార్టీలను నిర్వహించిన చరిత్ర అతడికి ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయ్యారు.