Hero Suriya: హీరో సూర్యకు ప్రపోజ్ చేసిన యాంకర్ స్రవంతి

by Prasanna |   ( Updated:2024-10-28 08:27:51.0  )
Hero Suriya: హీరో సూర్యకు ప్రపోజ్ చేసిన యాంకర్ స్రవంతి
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ్ స్టార్ హీరో సూర్య ( Hero Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోకి తమిళ ల్లోనే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అలాగే తన సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తాజాగా, సూర్య హీరోగా కంగువా (Kanguva) సినిమా తెరకెక్కింది. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా నవంబర్ 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అయితే, తాజాగా ఆదివారం వైజాగ్ లో కంగువా (Kanguva) సినిమా ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సూర్య, డైరెక్టర్ శివ, హీరో సందీప్ కిషన్ అటెండ్ అయ్యారు.

అయితే, ఈ ఈవెంట్ కి యాంకర్ స్రవంతి, యాంకర్ రవి హోస్ట్ చేసారు. ఈవెంట్ అయ్యాక సూర్య చిన్న పిల్లలతో గ్రూప్ ఫోటో దిగారు. కొందరు స్టేజిపైకి వచ్చి సూర్యతో ఫోటోలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ స్రవంతి మోకాళ్ళ మీద కూర్చొని గులాబీ పువ్వు సూర్య చేతికి ఇస్తూ లవ్ యు అని చెప్పింది. దీంతో సూర్య కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఆ పువ్వును తీసుకున్నాడు. ప్రస్తుతం, ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

యాంకర్ స్రవంతి మోకాళ్ళ మీద కూర్చొని సూర్యకు పువ్వు ఇవ్వడం ఒక ఎత్తైతే సూర్య కూడా మోకాళ్ళ మీద కూర్చొని పువ్వు తీసుకోవడంతో అభిమానులు, నెటిజన్లు సూర్యని ( Hero Suriya) అభినందిస్తున్నారు.

Read More :Tollywood: పదేళ్ళ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

Advertisement

Next Story