కాలువల్లో నీళ్లు వదలండిః హరీష్‌ రావు

by Nagam Mallesh |
కాలువల్లో నీళ్లు వదలండిః హరీష్‌ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రంగనాయక సాగర్ లో ఇటీవల మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగింది కాబట్టి కాలువల్లో నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణతో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 2.3 టీఎంసీల నీరు ఉంది. 3టిఎంసిల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు. రిజర్వాయర్ ల నుండి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అదేవిధంగా కెనాల్స్ లలో మట్టి, పిచ్చి గడ్డి తుంగ పెరుక పోయిందని వెంటనే తొలగించాలని చెప్పారు.

Advertisement

Next Story