కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గూడూరి శ్రీనివాస్ దరఖాస్తు

by Naresh |   ( Updated:2023-08-25 12:42:14.0  )
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గూడూరి శ్రీనివాస్ దరఖాస్తు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పీసీసీ చేనేత విభాగం ఛైర్మెన్ గూడూరి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌కు దరఖాస్తును అందజేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గూడూరి శ్రీనివాస్ గత 25 ఏళ్లు గా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ గా, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. గత పదేండ్లు గా పీసీసీ చేనేత విభాగం ఛైర్మెన్ గా పనిచేస్తూ..పద్మశాలి ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశారు. ఈ సందర్భంగా గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ..తనకు అవకాశం వస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి విధేయుడు గా పనిచేస్తానని తెలిపారు.

Advertisement

Next Story