సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జా..

by Kalyani |
సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జా..
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో రోజురోజుకు భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, ఏళ్లుగా పడి ఉన్న ఓపెన్ స్థలాలే ధ్యేయంగా ఇష్టారాజ్యంగా కబ్జాదారులు, రియల్టర్లు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి బై పాస్ రోడ్డు సాయిబాబా గుడి కమాన్ వద్ద గల సర్వే నెంబర్ 374 లోని 100 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకి గురైంది.

సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జా..దీంతో కాలనీ వాసులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. కోటి విలువ చేసే స్థలం కబ్జాకి గురవుతున్నా పట్టించుకునే వారు లేరా అని, అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతోనే ప్రభుత్వ స్థలం కబ్జా గురైందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story