- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ రంగంలో సర్కార్ అద్భుత ఫలితాలు : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
దిశ, వర్గల్: వ్యవసాయ రంగంలో సర్కార్ అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం తునికి ఖాల్సా, వేలూరు, నెంటూరు గ్రామాల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, జడ్పీటీసీ బాలుయాదవ్, ఎంపీపీ లతా రమేష్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వేలూరు వెంకట్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి ఫలితంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతో 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి రికార్డు సృష్టించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పటికీ అన్నదాతను అన్ని రకాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మొండి వైఖరితో నిధులు కేటాయిస్తూ, రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఘనతను దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు.
ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉండగా, వారు ఆర్థికంగా పురోగతి సాధించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ముఖ్యంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి చేరుకున్న తెలంగాణ రైతులు ధన్యులన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయగా, అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకొని వారి జీవితాల్లో నింపారన ఆయన తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ లు కటికె సంధ్య జానీ, పాపి రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, రైతుబంధు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు జనార్దన్, షాదుల్లా గౌడ్, నాయకులు విద్యా కుమార్, యాదగిరి గౌడ్, నాగరాజు, నర్సింహులు, స్వామి, వీరా గౌడ్, మండల వ్యవసాయ అధికారి శేషశయన, తదితరులు పాల్గొన్నారు.