మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి

by Shiva |
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
X

దిశ, నర్సాపూర్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా మండలాలకు చెందిన మహిళలకు రూ.11.92కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన అనే రెండు కార్యక్రమాలను తీసుకురావడం సంతోషకరమని అన్నారు. మహిళల్లో రక్తహీనత, థైరాయిడ్, గర్భసంచి పరీక్షలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాల సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గుప్తా, ఇన్ చార్జి ఎంపీపీ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story