- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యూలరైజేషన్ కు సానుకూలంగా ప్రభుత్వం : మంత్రి కేటీఆర్
దిశ, అక్కన్నపేట : హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ కు అక్కన్నపేట మండలంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యూలరైజ్ చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. అందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం ఏంటని.. వెంటనే సమ్మె విరమించాలన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వందశాతం రెగ్యులరైజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నామని పేర్కొన్నారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన జీవో ప్రకారం జేపీఎస్ లను రెగ్యూలరైజ్ చేస్తామన్నారు. అనవసరంగా సమ్మె చేస్తూ ప్రభుత్వాన్ని దూరం చేసుకుంటున్నారని తెలిపారు. మంత్రికి వినతిపత్రం అందజేసిన వారిలో సన్నిల తిరుమల, దివ్య, శారద, జ్యోతి, స్వాతి, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.