రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి

by Shiva |
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి
X

అన్నదాతల అభ్యున్నతి కోసం ఏటా రూ.30 వేల కోట్ల ఖర్చు

దిశ, వెల్దుర్తి : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తిలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా జరిగిన రైతు దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల అభ్యున్నతి ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు లక్షలాది టన్నుల ధాన్యాన్ని పండించినప్పటికీ రైతులకు గౌరవంగా క్వింటాల్ కు రూ.2,060 మద్దతు ధర చెల్లించి ఏటా రూ.30 వేల కోట్లను వ్యవసాయ రంగానికి ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు.

మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మించిందన్నారు. అందులో రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని పంటల సాగుపై అధికారులు ఇచ్చే సూచనలు ద్వారా వ్యవసాయం సాగు చేసుకునేందుకు ఎంతో దోదపడుతుందన్నారు. రైతులు ఎప్పుడూ వరి ధాన్యం పండించకుండా పంటల మార్పిడి జరిపి ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొంది మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారని తెలిపారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పడి దశాబ్ధం కావడంతో సీఎం కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాల పేర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను 22 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలకు విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 28 రైతు వేదికల్లో 30 వేల మంది రైతులతో రైతు దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తప్పకుండా అమలు చేసిందని ప్రకృతి బీభత్సంతో వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రభుత్వం అందిస్తుందని రైతులు అధైర్యపడొద్దని సూచించారు.

అదేవిధంగా అంతకుముందు ఎడ్లబండ్ల ర్యాలీలో మదన్ రెడ్డి సునీతారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, పీఎస్ఎస్ చైర్మన్ అనంతరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సర్పంచ్ లు భాగ్యలక్ష్మి, అశోక్ రెడ్డి శేఖర్ యాదవ్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, వ్యవసాయ శాఖ ఏడిఏ పద్మ నాయకులు నర్సింలు రాజిరెడ్డి శేఖాగౌడ్ శ్రీనివాస్ రెడ్డి సురేందర్ రెడ్డి బాగా రెడ్డి శ్రీనివాస్ గౌడ్ రైతులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story