గజ్వేల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా

by Sridhar Babu |
గజ్వేల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా
X

దిశ గజ్వేల్ / కొండపాక : గజ్వేల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్, తంజిముల్ మజీద్ కమిటీ చైర్మన్ మథిన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట రుణమాఫీ, 6 గ్యారంటీలతో పాటు ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాలని సూచించారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిరూపించాలని కోరారు. ముఖ్యంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందని తెలిపారు. గజ్వేల్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని, అలాగే అక్కడి సమస్యల పరిష్కారంలో తన వంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన పక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించుకుందామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు ఉప్పల శ్రీనివాస్ గుప్త, హరినాథ్ గుప్త, మహంకాళి శ్రీనివాస్ గుప్త, యాదగిరి, డాక్టర్ వహీద్, రామా గౌడ్, వెంకటస్వామి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నేతలు సుభాష్ చంద్రబోస్, సమీర్, రాములు గౌడ్, జహీర్, గాడిపల్లి శ్రీనివాస్, ఎక్బాల్, శివారెడ్డి, బలరాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story