- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేరుగా పంచాయతీ అకౌంట్లలోకి నిధులు : సర్పంచ్ లకు మంత్రి హరీష్ రావు శుభవార్త
దిశ బ్యూరో, సంగారెడ్డి: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అకౌంట్లలోకే నిధులు వేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కులబ్ గురులో దీన్ దాయల్ జాతీయ పంచాయతీ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ లకు శుభవార్తను తెలిపారు. పంచాయతీ అకౌంట్లలో నిధులు ఉంటే అభివృద్ధి పనులకు వినియోగించు కునేందుకు వీలుంటుదని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 27 పంచాయతీలను జిల్లా స్థాయి అవార్డులు వరించాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు తన వద్దకు వచ్చారని 4 నుంచి 5 రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని, బీదర్ లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారని తెలిపారు. మన పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో ఇంటింటికీ రోజు మంచి నీరు వస్తుందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఇప్పడు దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు. వడగళ్లతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నామని, బీజేపీ వాళ్లు రూ.10వేలు సరిపోవు అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ నుంచి రూ.10 వేలు తెస్తే తాము రాష్ట్రం నుంచి రూ.20 వేలు ఇస్తామన్నారు. బీజేపీ కి రైతుల గురించి మాట్లాడే అర్హతు లేదన్నారు. నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ.. పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ, గ్యాస్ ధరలు పెంచి, మోటర్లకు మీటర్లు పెట్టింది బీజేపీ కాదా అంటూ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా ఎందుకు చేయలేదని బీజేపీ నేతల ప్రశ్నలకు మంత్రి స్పందించారు. ఆ పథకాన్ని ప్రధాని తన సొంత రాష్ట్రంలో అమలు చేయాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి సంసద్ యోజన లో పదికి పది తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశీస్తున్నామని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు