- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Former MLA Padmadevender Reddy : అన్నమో రామచంద్ర అంటున్న రైతులను ఆదుకోవాలి..
దిశ, చేగుంట : అన్నమో రామచంద్ర అంటున్న రైతులను ప్రభుత్వ వెంటనే ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నార్సింగి మండల పరిధిలోని జప్తి శివునూర్ గ్రామంలో మంగళవారం రోడ్ల పై ఆరబోసిన వరి ధాన్య కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును ఆమె ముందు వెల్లబోసుకున్నారు. ఆరుగాలం పండించి రోడ్ల పై ఆరబోసిన ధాన్యం ఎండలకు ఎండుతూ వానలకు తడుస్తూ ఉన్నాయని, కొనుగోలు కేంద్రం కోసం కొబ్బరికాయ కొట్టారే తప్ప కొనుగోలు ప్రారంభించలేదని ఆమెకు తెలిపారు. రైతులు తమ బాధను తెలియజేయగా వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. మెదక్ ఎమ్మెల్యే రైతులను పట్టించుకోకుండా ఉన్నారని కనీసం అధికారులైనా రైతుల గోసను అర్థం చేసుకొని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. పూర్తిగా తడిసిన వరి ధాన్యంతో పాటు చివరి గింజ వరకు కొనాలని కోరారు.
వరి ధాన్యం తేమ శాతం సైతం 14 ఉండాలని ఆదేశించడం మంచిది కాదని గతంలో 17 శాతం వరకు ఉన్నా కొనే వారని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని రైతు భరోసా పడలేదని రైతు రుణమాఫీ కూడా సక్రమంగా కాలేదని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని లేని పక్షంలో ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం కాకపోవడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని 1700, 1800 వందల రూపాయలకే అమ్ముకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రతి గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఒకటి ఐకేపీ ద్వారా మరొకటి సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశామని పేర్కొన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెంట నార్సింగి మాజీ వైస్ ఎంపీపీ సుజాత శంకర్, మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు, చిన్న శంకరంపేట మండల అధ్యక్షులు పట్లూరి రాజు, కాసులాపూర్ యాదగిరితో పాటు రైతులు నాయకులు పాల్గొన్నారు.