మహబూబ్ సాగర్ లో చేపలు మృతి

by Sridhar Babu |
మహబూబ్ సాగర్ లో చేపలు మృతి
X

దిశ, సంగారెడ్డి : కాలుష్య జలాల వల్ల మహబూబ్ సాగర్ లో చేపలు మృత్యువాత పడ్డాయి. బుధవారం ఉదయం చేపలు చనిపోయి నీళ్లపై తేలియాడాయి. దీంతో మత్య్సకార కుటుంబాలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి తమను ఆదుకోవాలని సమాచారం అందించారు. దీంతో ఆయన ఇరిగేషన్, మత్య్సశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు. చేపలు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. నీటి కాలుష్యం వల్ల చేపలు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మహబూబ్ సాగర్ లో చేపలు పట్టి జీవనోపాధి పొందుతున్న కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా మహబూబ్ సాగర్ నీటి కాలుష్యం వల్ల చేపలు చనిపోయాయని,

అదే కాకుండా పెద్ద ఎత్తున గుర్రపు డెక్క ఉందన్నారు. దీనిని తొలగించాలంటే మహబూబ్ సాగర్ పూడికతీత ఒక్కటే మార్గమని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర్, జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖలను కలిసి చెరువు పూడికతీతకు నిధులు కేటాయించాలని కోరుతానన్నారు. చేపలు పట్టుకుని జీవనం పొందుతున్న కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అధికారులు మహబూబ్ సాగర్ లోకి సంగారెడ్డి పట్టణ డ్రైనేజీ నీరు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పూర్తిగా మహబూబ్ సాగర్ ను ఖాళీ చేసి పూడికతీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, మున్సిపల్, మత్య్సశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed