పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి

by Shiva |
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి
X

దిశ, కొల్చారం: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొంగోడు, నాయిని జలాల్పూర్, అంసాన్పల్లి, వసురంతండా, కొల్చారం, పొతంశెట్టిపల్లి, చిన్న ఘనపూర్, సంగాయిపేట, రంగంపేట, ఎనగండ్ల గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గత రెండు రోజుల క్రితం వడగళ్ల వానకు ధ్వంసమైన వరి పంటను సంగాయిపేటలో వారు పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకుంటుందని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని తూర్పారబట్టి పూర్తిగా ఎండిన తరువాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనగోలు చేయాలని అధికారులకు రైతులు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గౌరీ శంకర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడుఅరిగే రమేష్ కుమార్, సర్పంచ్ లు ఉమా రాజాగౌడ్, మన్నె శ్రీనివాస్, మంజుల సత్యనారాయణ, కిష్టయ్య నాగరాణి, సిద్ధిరాములు, ఇందిరా ప్రియదర్శిని, సందీప్ మానస శ్రీనివాస్ రెడ్డి, బండి సుజాత రమేష్, సహకార సంఘాల అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, మనోహర్, మంద నాగులు, మంజీరా రైతు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు గణేష్ రెడ్డి, రైతు సహకార సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు రవితేజ రెడ్డి, ఏడుపాయల ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్లు యాదయ్య, గౌరీశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story