రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలి : కలెక్టర్

by Kalyani |
రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలి : కలెక్టర్
X

దిశ, ములుగు: రైతులకు నాణ్యమైన ఆయిల్ ఫామ్ మొక్కలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ములుగు లోగల ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గల మూడు నర్సరీలలో 8 లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు 11,108 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటడం జరిగిందని అలాగే ఈ సంవత్సరం మరో 4 వేల మొక్కలను నాటేందుకు నిర్దేశించడం జరిగిందన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం అయినందున ఆయిల్ ఫామ్ రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ హార్టికల్చర్ అధికారులకు సూచించారు. అలాగే మొక్కలు సిద్ధంగా ఉన్నందున త్వరగా నాటుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ శంకర్, ములుగు నర్సరీ ఇంచార్జ్ శ్రీకర్, హార్టికల్చర్ అధికారులు అనిల్, సౌమ్య ఉన్నారు.

Next Story

Most Viewed