- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీళ్ల కోసం ఇరిగేషన్ ఎస్సీఈ ఆఫీసు ముందు రైతుల ధర్నా
దిశ, చిన్నకోడూరు: సాగునీరు కోసం రైతులు ధర్నా చేపట్టిన సంఘటన మండల పరిధిలోని రంగనాయక సాగర్ ఎస్సీ ఈ ఆఫీసు వద్ద శనివారం జరిగింది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మాచాపూర్ నుంచి మేడిపల్లి వరకు వెళుతున్న రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్ కాలువ కు ఓటి ఏర్పాటు చేసి నీరు అందించాలని రైతులు ఎస్సీ ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
మాచపూర్ గ్రామానికి చెందిన ఆసార్ల ఆగమల్లు వ్యవసాయ పొలం వద్ద ఓటిని ఏర్పాటు చేస్తే ఎల్లాయపల్లె మాచాపూర్ గ్రామం రైతులు సుమారు 200 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. అధికారులు నీళ్లు అందించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించిన పెద్ద గండి చెరువుకు నీరు అందించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు మండిపడ్డారు.
అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నీరు అందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు లేకుంటే మా పంటలు ఎండిపోయి మేము నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇరిగేషన్ డి ఈ రాజమల్లు మాట్లాడుతూ రెండు రోజుల్లో తాత్కాలికంగా రైతులకు నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.