Minister Ponnam Prabhakar Goud : రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాల పై అవగాహన..

by Sumithra |
Minister Ponnam Prabhakar Goud : రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాల పై అవగాహన..
X

దిశ, కోహెడ : కోహెడ మండల కేంద్రంలోని కోహెడ, బస్వాపూర్ గ్రామాలలో రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల పై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కోహెడ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్టీల్ బ్యాంక్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్లాస్టిక్ ను దూరం చేస్తూ అందరూ పర్యావరణానికి అనుకూలమైన స్టీల్, మట్టి పాత్రలు వాడాలి. కోహెడ మండలంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో 80 గ్రామాలకు సంస్థ.. 80 గ్రామాలకు నేను స్టీల్ బ్యాంక్ పెట్టాలని భావిస్తున్నాం. ప్రతి గ్రామంలో 400 మంది వరకు ఉపయోగించుకునే విధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ నిర్వహణ ఉంటుందని అన్నారు.

ప్లాస్టిక్ ను దూరం చేద్దాం..స్టీల్ వాడుదాం.. క్విట్ ఇండియా..క్విట్ ప్లాస్టిక్ నినాదంతో ముందుకు పోదాం..

మనరోజు వారి జీవితం నుండి ప్లాస్టిక్ ను దూరం చేయాలి. మట్టితో తయారు చేసిన బోనాలు, మట్టితో తయారు చేసిన వినాయకులు వాడాలి అని అన్నారు. అనంతరం కోహెడ రైతువేదిక ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రి పొన్నం వ్యవసాయ అనుబంధ రంగాల వివిధ పథకాలు సంప్రదాయ పంటలు కాకుండా ఆదాయం వచ్చే పంటలు, డైరీ తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పిస్తూ రైతులు లబ్ధిపొంది, ఆర్థిక వృద్ధి చెందేలా చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఒకసారి వేస్తే ఆయిల్ ఫామ్ వేస్తే సంవత్సరాల తరబడి దిగుబడి వచ్చి మీ జీవితాలను మారుస్తది రైతులు ముందుకు వచ్చి అయిల్ ఫామ్ తోటలు వెయ్యాలి. వాణిజ్య పంట డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెంచాలి. అలాగే పెరటికోళ్లు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తుంది. పెరటి కోళ్ల పెంపకానికి 50 లక్షల రూపాయల ఋణం 50 శాతం సబ్సిడితో అందిస్తాము. మల్బరి చెట్లను పెంచి పట్టుపురుగుల పెంపకం చేపట్టాలి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తది 2 ఎకరాల్లో చేస్తే సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల ఆదాయం వస్తది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ తో గొర్రెలు, కోళ్లు, మేకలు, గడ్డి పెంపకం 20 నుండి 1 కోటి రూపాయల వరకు ఋణం 50 శాతం సబ్సిడీతో అందిస్తాము అని అన్నారు. ఈజీఎస్ ద్వారా 12 రకాల పండ్ల తోటలు పెంచుకోవచ్చు. మహిళలకు 12 కోట్ల 50 లక్షల రూపాయల వడ్డీలేని రుణాలను ఇచ్చాము.

ఇందిరా మహిళశక్తి కార్యక్రమం ద్వారా పెరటి కోళ్ల పెంపకం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 30 శాతం సబ్సిడితో ఏర్పాటు, పాలశీతలీకరణ కేంద్రం పెట్టుకోవచ్చు.. లోన్ భీమా 2 లక్షల వరకు ప్రమాద బీమా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వర్తింపజేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం 2 విడుతలుగా 1 లక్షా 50 వేల రూపాయల రుణమాఫీ చేసింది. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే వ్యవసాయ అధికారులను కలవాలి అని అన్నారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ రాకుంటే ప్రజాపాలన సేవ సేవకేంద్రాల వద్ద ఆధార్ అనుసంధానం చేయించుకోండి. గ్యాస్ సబ్సిడీ రాకున్నా కూడా ప్రజాపాలన సేవాకేంద్రాల వద్ద ఆధార్ అనుసంధానం చేసుకుంటే సబ్సిడీ వస్తది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్యా, జిల్లా వ్యవసాయ అధికారి ప్రభాకర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, పశువైద్యధికారి శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ సురేఖ, ఎంపీడీవో క్రిష్ణయ్య, డాక్టర్ నిమ్రా, మండల అధ్యక్షులు మంద ధర్మన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టి సుధాకర్, బసవరాజ్ శంకర్, దొమ్మాట జగన్ రెడ్డి, గోరిట్యాల లక్ష్మణ్, కర్ర రవీందర్, చక్రధర్, భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, చింతకింది శెంకర్, గూడ స్వామి, బందెల బాలకిషన్, పిల్లి రాజయ్య, పాము శ్రీకాంత్, పూల బాలయ్య, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story