MLA Sanjeev Reddy : రైతు పక్షపాతి CM రేవంత్ రెడ్డి

by Kalyani |
MLA Sanjeev Reddy : రైతు పక్షపాతి CM రేవంత్ రెడ్డి
X

దిశ, కంగ్టి: రైతు సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్, జంగి (కె) లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సన్న వడ్లకు రూ. 500 అదనపు బోనస్ అందించనున్నారని, ఏ వన్ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2320, సన్న వడ్లకు రూ. 2820 మద్దతు ధర గా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని, దళారులకు విక్రయించకుండా ఉండాలని సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షులు మల్ల రెడ్డి, పెద్ద మల్ల రెడ్డి, కృష్ణ రెడ్డి, మనోహర్,అమీర్ , శ్రీనివాస్ రెడ్డి, తుకారం, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed