విద్యుత్ షాక్ తో రైతు మృతి

by Shiva |
విద్యుత్ షాక్ తో రైతు మృతి
X

దిశ, కౌడిపల్లి : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తునికి గ్రామానికి చెందిన జంపని మారయ్య (70) తన వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ ఉంది. విద్యుత్ అంతరాయం వలన ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వైర్ కాలిపోయింది. జంపర్ కొట్టి ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కేబుల్ వైర్ కు తగలగా మారయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిడు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరయ్య మాజీ సైనిక ఉద్యోగి. తునికి గ్రామ శివారులో వ్యవసాయ పొలం కొని సాగు చేస్తున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా తునికి గ్రామస్తులకు మరయ్య పరిచయం ఉంది.

Advertisement

Next Story