పల్లె దవాఖానాను అందరూ ఉపయోగించుకోవాలి

by Sridhar Babu |   ( Updated:2024-08-21 13:29:52.0  )
పల్లె దవాఖానాను అందరూ ఉపయోగించుకోవాలి
X

దిశ, కోహెడ : అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించి పల్లె దవాఖానాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడ మండలంలోని బస్వాపూర్ లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. పాత టైర్లు , పాత గోళాలను తొలగించాలని కోరారు.

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా చేసుకోవాలని సూచించారు. బీపీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, వంటల్లో ఉప్పు తక్కువగా తినాలని సూచించారు. నియోజకవర్గంలో 30 మేజర్ గ్రామ పంచాయతీ లు ఉన్నాయని, అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, డీఎం హెచ్ ఓ కోహెడ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్​ నిమ్ర , బస్వాపూర్ ఉప కేంద్రం డాక్టర్​ సాత్విక, మండల అధ్యక్షులు మంద ధర్మయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story