ఎన్నికల నిబంధనలు పాటించాలి

by Naresh |
ఎన్నికల నిబంధనలు పాటించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించినందున ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ అనుమతులకు సంబంధించి సువిధ యాప్‌లో ఆన్ లైన్‌లో లేదా నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.

పోస్టర్లు, పాంప్లెంట్‌లను ముద్రించేటప్పుడు వాటి మీద ప్రింటర్స్ అడ్రస్ కచ్చితంగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై నిఘా ఉంచేందుకు కలెక్టర్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, సీ విజిల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, నేషనల్ గ్రీవెన్స్ రిడ్రసల్ వింగ్, ఎంసీ ఎంసీ తదితర వింగ్స్ ఉంటాయన్నారు. ఈసారి 85 సంవత్సరాల పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం ఉంటుందని తెలిపారు. ఈవీఎంలు, పోలింగ్ పర్సన్ ర్యాండమైజేషన్‌లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులు పాల్గొని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ఎలక్షన్ సూపరింటెండెంట్ మధుసూదన్, ఎలక్షన్ డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed