- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
దిశ, చేర్యాల: అకాల వర్షం, వడగండ్ల వానకు పంట కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని నాగపురి, గండికుంట, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి , కడవేర్గు, చుంచనకోట గ్రామాల్లో శనివారం ఈదురుగాలులతో పాటు రాళ్లతో కూడిన భారీ వర్షం పడడం నష్టపోయిన పంటలను పరిశీలించిన పొన్నాల లక్ష్మయ్య రైతులను ఓదార్చారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన వల్ల రైతులు నష్టపోయారని, చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, మామిడి, పంటలు నేల పాలవడం చాలా బాధాకరమని అన్నారు. రైతు నారు పోసిన దగ్గర నుంచి మొదలు పెడితే పంట చేతికొచ్చే వరకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షం వల్ల పంట అంతా నేల పాలైందని, మార్కెట్లో పోసిన వడ్లు సైతం పూర్తిగా తడిసిపోయి రైతులు నష్టపోయారని అన్నారు.
నష్టపోయిన రైతులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సర్వే చేసి ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. దేశానికి రైతు వెన్నెముక అని చెప్పే ప్రభుత్వాలు ప్రకృతి అనుకూలించక నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారుగా 5 వేల ఎకరాల పంటలు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులకు పదవులపై ఉన్న ఆర్పాటం ఆడంబరం, రైతుల బాధల పట్ల అవగాహన లేదని మండిపడ్డారు. సీఎం కేసిఆర్ మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎద్దేవా చేశారు.
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అది శ్రీనివాస్, మైనారిటీ రాష్ట్ర సెక్రెటరీ సయ్యద్ ఎక్బాల్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సయ్య పంతులు, జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరికొండల్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కొమ్ము రవి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.