దుబ్బాక చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Shiva |
దుబ్బాక చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, దుబ్బాక : దుబ్బాక చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లా నియోజకవర్గ పరిధిలోని తంగళ్లపల్లి మండలం సారంపల్లి టెక్స్ టైల్స్ పార్కును సోమవారం దుబ్బాక నియోజకవర్గ చేనేత కార్మికులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తంగళ్లపల్లి చేనేత కార్మికులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను వారుల శాలువాతో సత్కరించారు. అనంతరం తంగళ్లపల్లి చేనేత పరిశ్రమను నిషితంగా పరిశీలించారు. కార్మికులతో నేరుగా మాట్లాడుతూ.. వారి స్థితిగతులు, ఉపాధి అవకాశాలను స్థానిక అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక చేనేతలను అదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

Advertisement

Next Story