యువత మత్తుకు బానిస కావద్దు: డీఎస్పీ

by Web Desk |
యువత మత్తుకు బానిస కావద్దు: డీఎస్పీ
X

దిశ, కంది: యువత మత్తుకు బానిస లు కాకుండా మంచి మార్గం వైపు పయనించాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ నాయక్ సూచించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఎస్ వి జూనియర్ కళాశాలలో విద్యార్థులతో గంజాయి, డ్రగ్స్ రహిత అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల యువతరం చెడు మార్గాల వైపు ప్రయాణించే ప్రమాదం తీవ్రంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మత్తుకు బానిస కాకుండా వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇకపోతే ఎవరైనా మత్తుపదార్థాలు చేయిస్తున్నట్టు తెలిస్తే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్, కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed