ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో తాగునీటి బోర్లు

by Naresh |   ( Updated:2023-09-21 14:20:18.0  )
ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో తాగునీటి బోర్లు
X

దిశ, హవెళి ఘనపూర్: హవెళి ఘనపూర్ మండలంలోని సర్దనలో ఎంఎస్ఎస్ఓ చైర్మన్ రోహిత్ ఆధ్వర్యంలో త్రాగునీరు కోసం గురువారం బోరు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తాగు నీటి కోసం బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన మైనం పల్లి రోహిత్ గ్రామ శివారులోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలోని కింది భాగాన ఒక బోరు, వెంకటేశ్వర దేవాలయానికి ప్రక్కన మరొక బోరు, అలాగే చర్చి సమీపంలో మరొక బోరు వేయించారు. వేసిన మూడు బోర్లు కూడా పుష్కలం నీళ్లు పడటంతో గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎల్లవేళలా రోహిత్ వెంబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఓ సభ్యులు పరశురాం గౌడ్, భరత్, సాయిరాం, గ్రామ ఉపసర్పంచ్ రాంచందర్రావు, గ్రామ యువకులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story