అటు శునకాలు… ఇటు వానరాలు

by Kalyani |
అటు శునకాలు… ఇటు వానరాలు
X

దిశ, మద్దూరు : ఓ వైపు శునకాలు మరో వైపు వానరాలు రోడ్డుపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహనదారులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మద్దూరు మండల కేంద్రంలో రోడ్డుపై శునకాలు, వానరాలు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో వాహనదారులు ప్రయాణికులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో వాహనాల పైకి వస్తున్నాయని వాహనాలు అదుపుతప్పి గాయాలపాలు అవుతున్నామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో విద్యార్థులకు గాయాలు చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు, కోతులు రోడ్డుపై గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో మహిళలు, చిన్నపిల్లలు రోడ్డుపైకి రావడానికి జంకుతున్నారు. వీధి కుక్కల, కోతుల బెడదను అరికట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed