ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి: కలెక్టర్ హరీష్

by Hajipasha |   ( Updated:2023-01-20 07:40:41.0  )
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి: కలెక్టర్ హరీష్
X

దిశ, తూప్రాన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ కోరారు. ఈ సందర్భంగా ఆయన తూప్రాన్‌లో 4వ వార్డ్ కంటి వెలుగు కార్యక్రమం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజా ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రజల కోసం ప్రత్యేకంగా అన్ని ఉచితంగా కంటి సమస్యలకు పరిష్కారం కావాలని.. ఈ కార్యక్రమం చేపట్టారని కంటి వెలుగు ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుమారుగా జిల్లాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఒకవేళ ప్రజలు ఎక్కువగా వస్తే 5 రోజులో పూర్తి చేయకుండా 10 రోజుల వరకు పొడిస్తామని తెలిపారు. స్థానిక కౌనిలర్స్ ప్రజా ప్రతినిధిలు సర్పంచ్‌లు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిండ్ల కృష్ణ, రఘుపతి, వైద్యులు ఆనంద్, ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed