త్వరగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

by Sumithra |
త్వరగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో 741 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేస్తామని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పేదలను వివాహం చేసుకునేందుకు ఇది ఎంతగానో తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అదే విధంగా మహిళలకు సబ్సిడీ గ్యాస్ పథకం తీసుకువచ్చిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 741 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందిస్తున్నామన్నారు. సంగారెడ్డిలో 394 మందికి, కందిలో 65 మందికి, కొండాపూర్ లో 143 మందికి, సదాశివపేటలో 139 మందికి చెక్కులు పంపిణీ చేశామన్నారు.

ఆలస్యం లేకుండా చెక్కులు అందించాలి.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్..

ప్రభుత్వం పేదలను ఆదుకునేందునే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎలాంటి ఆలస్యం లేకుండా చెక్కులు పంపిణీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఇది పేద కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ రాజు, తహశీల్దార్ దేవదాసు, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, కూన సంతోష్ కుమార్, కిరణ్ గౌడ్, మహేష్, కంది మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింలు వివిధ మండలాల కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed