- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ కు రూ.లక్ష విలువ చేసే డెస్కుల అందజేత
దిశ, కోహెడ : మనోజ్ టిబ్రీవాలా ఫౌండేషన్-హైదరాబాద్ వారి సౌజన్యంతో, సంస్థ ప్రతినిధి శ్రీ పుప్పాల గోపాలకృష్ణ తంగళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలకు రూ.లక్ష విలువ చేసే డ్యూయల్ డెస్కులను అందజేశారు. దాంతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.25 వేల రూపాయల విలువచేసే స్పోర్ట్స్ మెటీరియల్ ను అందజేశారు. అదేవిధంగా పాము మాధవి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులకు మొత్తం రూ.13 వేల రూపాయల నగదు పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిఎల్ఆర్ తడిసిన లింగారెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.25వేల రూపాయల విలువగల టాయిలెట్స్ క్లీన్ చేసే వాటర్ మిషన్స్ ను త్వరలోనే అందజేస్తామని సంస్థ ప్రతినిధి కీర్తిశేషులు శ్రీ తడిసిన లింగారెడ్డి గారి కుమారుడు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్.పద్మ, ఆర్.శైలజ, తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి పాము నాగేశ్వరి-శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కోనె శేఖర్, ఏఏపిసి చైర్మన్లు మ్యాదర లావణ్య, పిల్లి లావణ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు బండమీది రాజమౌళి, బండిపెల్లి నారాయణ, తడిసిన చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి సత్యనారాయణ, సి.అర్.పి రాజేశం, చిగిరి కొమురయ్య, బోయిని స్వామి, బోయిని యాదయ్య, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.