Disha effect : కదిలిన అధికార యంత్రాంగం

by Kalyani |
Disha effect : కదిలిన అధికార యంత్రాంగం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులో 'పంట పొలాల్లో బీరు ఫ్యాక్టరీ వ్యర్ధాలు' పేరిట గురువారం దిశలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా పంచాయతీ అధికారులతో పాటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించారు. శుక్రవారం స్థానిక డిఎల్పిఓ అనిత, ఎంపీఓ సువర్ణ, స్థానిక పంచాయతీ కార్యదర్శిని తమ వెంట తీసుకుని బీర్ ఫ్యాక్టరీకి వెళ్లారు. పంట పొలాల్లో బీరు ఫ్యాక్టరీ వ్యర్ధాలు ఎలా పడేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి పంట పొలాల్లో చెత్తా,చెదారం వేస్తున్నారు అంటూ స్థానిక ఫ్యాక్టరీ సిబ్బందిని ప్రశ్నించారు.

వెంటనే సాయంత్రం లోపు అక్కడ వేసిన చెత్తా, చెదారాన్ని మొత్తం శుభ్రం చేయాలని ఆదేశించారు. మళ్లీ అక్కడ చెత్త వేయకుండా ఒక బోర్డును ఏర్పాటు చేయాలంటూ సూచించారు. అలాగే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా స్పందించి సంఘటన స్థలానికి వెళ్లారు. ఫ్యాక్టరీకి చెందిన కాంట్రాక్టర్, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పంట పొలాల్లో చెత్త వేస్తున్నట్లు వారు గుర్తించినట్లు చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. 'దిశ'లో ప్రచురితమైన కథనానికి వెంటనే సంబంధిత అధికార యంత్రాంగం స్పందించడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed