- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malvika Bansod : మాళవిక సంచలన ప్రదర్శనకు బ్రేక్.. చైనా ఓపెన్ నుంచి ఔట్
దిశ, స్పోర్ట్స్ : చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ సంచలన ప్రదర్శనకు తెరపడింది. తనకంటే మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేస్తూ ముందుకెళ్లిన ఆమె సెమీస్‌కు చేరుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో మాళవిక 21-10, 21-16 తేడాతో వరల్డ్ నం.8, జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓటమిపాలైంది. రెండు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన యమగూచి తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ దూకుడగా ఆడగా మాళవిక ప్రత్యర్థిని నిలువరించలేకపోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది.
టోర్నీలో 23 ఏళ్ల మాళవిక అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి రౌండ్‌లోనే వరల్డ్ నం.7 గ్రెగోరియా మరిస్కా తుంజంగ్‌ను ఓడించిన ఆమె.. రెండో రౌండ్‌లో వరల్డ్ నం.25 క్రిస్టీ గిల్మర్‌పై విజయం సాధించింది. అయితే, క్వార్టర్స్‌లో మాళవిక ఓటమితో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.