ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు గుర్తించాలి

by Sridhar Babu |
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు గుర్తించాలి
X

దిశ బ్యూరో, ఖమ్మం : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి సారించి వాటిని విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరద బాధితులకు వస్తున్న సహాయ సొమ్ము లావాదేవీలు త్వరితగతిన పూర్తి చేయడంలో బ్యాంకర్ల పని తీరును కలెక్టర్ ప్రశంసించారు. బ్యాంకర్ల సహకారంతో వరద బాధితులకు ప్రభుత్వ సహాయం త్వరగా అందించామని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్వహించేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఇందిర మహిళా శక్తి కార్యక్రమం కింద యూనిట్ల గ్రౌండింగ్ విజయవంతంగా చేశామని, ప్రస్తుతం వాటికి అవసరమైన సహాయ సహకారాలు, సలహాలు అందించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను సంబంధిత బ్యాంకు మేనేజర్లు అప్డేట్ చేయాలని అన్నారు. రుణమాఫీ పూర్తయిన రైతులకు పంట రుణాల జారీపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ ఆర్. సన్యాసయ్య, ఎల్డీఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్​బీఐ ఆర్ఎం లింగ స్వామి, యూబీఐ ఏజీఎం సుధాకర్, అదనపు డీఆర్డీఓ నూరొద్దీన్, బ్యాంక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed