టెస్టు జట్టులోకి రీఎంట్రీకి పాండ్యా ప్లాన్.. దేశవాళీ ఆడేందుకు సిద్ధమవుతున్న స్టార్ ఆల్‌రౌండర్

by Harish |
టెస్టు జట్టులోకి రీఎంట్రీకి పాండ్యా ప్లాన్.. దేశవాళీ ఆడేందుకు సిద్ధమవుతున్న స్టార్ ఆల్‌రౌండర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా టెస్టు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తిరిగి రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో తిరిగి టెస్టు జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాండ్యా దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. బరోడా తరపున అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉందని బరోడా క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.

రంజీ ట్రోఫీలో పాండ్యా బరిలోకి దిగే చాన్స్ ఉంది. కొంతకాలంగా పాండ్యా రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2018 నుంచి పాండ్యా టెస్టులు లేదా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడలేదు. 2018లో ఇంగ్లాండ్‌పై అతను చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. రంజీ ట్రోఫీలో అక్టోబర్ 11న బరోడా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో తలపడనుంది.

Advertisement

Next Story