ఎమ్మెల్యే దానంపై మహిళా కమిషన్, ఏడీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా మోర్చా

by Mahesh |
ఎమ్మెల్యే దానంపై మహిళా కమిషన్, ఏడీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా మోర్చా
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ క్రమంలో గురువారం ఖైరతాబాద్ లో ఆయన దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే దానంను సస్పెండ్ చేయాలని.. గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం.. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలి నేతృత్వంలోని మహిళా నేతలు.. తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏడీజీపీకి ఫిర్యాదు చేసి.. మహిళా ఎంపీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా మహిళా మోర్చా ఫిర్యాదుపై మహిళా కమిషన్, ఏడీజీపీ సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా తెలిపారు.

Next Story