- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్టపగలే పుస్తెలతాడు అపహరణ
by Sridhar Babu |
X
దిశ, బొంరాస్ పేట్ : పట్టపగలే మహిళ మెడలో నుంచి దొంగలు పుస్తెలతాడు దొంగిలించారు. స్థానికుల సమాచారం మేరకు బొంరాస్ పేట్ మండలంలోని నాందర్ పూర్ గ్రామానికి చెందిన చిట్లపల్లి లక్ష్మి(లక్ష్మమ్మ) దుకాణం నుండి మధ్యాహ్నం రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇదే సమయంలో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు బైక్ పై వచ్చి ఆమెను చాకుతో బెదిరించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు.
దుండగులు పారిపోతున్న సమయంలో వారి నుంచి బ్యాగ్ కింద పడింది. అందులో వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారు మాట్లాడుకున్న భాష ఆధారంగా అంతరాష్ట్ర దొంగలుగా స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న కోడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రవూఫ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
- Tags
- Chainsnatching
Next Story