Jagtial Collector : ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి

by Aamani |
Jagtial Collector :  ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి
X

దిశ, జగిత్యాల టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా వ్యాధులు గాని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల గూర్చి వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రతి గురువారం పిహెచ్ సీ సెంటర్లలో ఓపి సేవలు నిర్వహించాలని, అలాగే 30 సంవత్సరాల పై బడిన వారికి కచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

గ్రామ పంచాయతీలలో డెంగ్యూ వ్యాధి కీటకం ప్రబలకుండా ఎంపీడీవోలు, ఎంపీవోలు పాంగింగ్, శానిటేషన్ నిర్వహించడం తో పాటు సీజనల్ వ్యాధుల యొక్క లార్వాలు వృద్ధి చెందే విధానం పై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని తెలిపారు. అదే విధంగా మెడికల్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొఫెసర్ కూడా అందుబాటులో ఉండి గర్భిణీ స్త్రీలకు సాధారణ డెలివరీ ల కోసం సరైన ఆహారం అందే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీయుద్దీన్, డిప్యూటీ డిఎంహెచ్ వో ఎన్ శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారి అర్చన, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed