- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maldives : మాల్దీవులకు మరోసారి భారత్ అత్యవసర ఆర్థికసాయం
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : మాల్దీవులను భారత్ మరోసారి ఆదుకుంది. ఆ దేశానికి అత్యవసర ఆర్థికసాయంగా ఏటా అందించే రూ.417 కోట్లను మరో ఏడాది కాలానికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు విలువతో కూడిన మాల్దీవుల ప్రభుత్వ బాండ్లను ఈనెల 19న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొనుగోలు చేసింది.
ఈవిషయాన్ని మాలేలోని భారత హైకమిషన్ కార్యాలయం వెల్లడించింది. ఇంతకుముందు ఈ ఏడాది మే నెలలోనూ ఇదేవిధంగా రూ.417 కోట్లు విలువైన మాల్దీవుల ప్రభుత్వ బాండ్లను ఎస్‌బీఐ కొనుగోలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం ఆదుకోవాలంటూ అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వం చేసిన రిక్వెస్టుపై స్పందిస్తూ భారత సర్కారు ఎస్‌బీఐ ద్వారా తక్షణ సాయాన్ని చేయించింది.
Advertisement
Next Story