- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల లడ్డూ వివాదం.. అందుకే కల్తీ చేశారంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదం పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అయితే కిలో నెయ్యి తక్కువ ధరకే (రూ.320) వస్తోందని తిరుమల లడ్డూను కల్తీ(forgery) చేశారని ఫైరయ్యారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని, తిరుమల పవిత్రతను(Sanctity of Tirumala) దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని, టెండర్లు పిలిచానని జగన్(YS Jagan) చెబుతున్నారని అన్నారు. రూ.320కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం వెనుకా ముందూ ఆలోచించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో(Tirumala Temple) పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ(forgery) నెయ్యి వినియోగించి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు విమర్శించారు.