- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు దాటుతుండగా వేగంగా ఢీకొట్టిన కారు…మహిళ స్పాట్ డెడ్
దిశ, కొల్చారం: మహిళ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, కొల్చారం పోలీసుల కథనం ప్రకారం వివరాలు .... పోతంశెట్టిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ముద్దంగుల. దుర్గమ్మ (60) శుక్రవారం మెదక్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి పోతంశెట్టిపల్లికి వచ్చింది. పోతంశెట్టిపల్లి హెచ్ పి పెట్రోల్ పంప్ వద్ద బస్సు దిగి ఇంటి వైపు వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా మెదక్ వైపు నుండి నర్సాపూర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో దుర్గమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు,మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలు దుర్గమ్మకు భర్త మల్లయ్య, ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.