Karimnagar Collector : ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోండి..

by Aamani |
Karimnagar Collector : ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోండి..
X

దిశ,హుజురాబాద్ రూరల్: గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రిల్లోకి వెళ్లి డబ్బులను ఖర్చు చేసుకోకూడదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన "శుక్రవారం సభ " కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ....ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు చేసుకునేందుకు చికిత్సలు తీసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రసవాలు కూడా ప్రభుత్వాసుపత్రిలోనే చేయించుకోవాలని ప్రైవేట్ ఆస్పత్రిలోకి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకూడదని సూచించారు.గర్భిణీలు,బాలింతలు అంగన్వాడీలో అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా భుజించాలని కోరారు.

చిన్నారులను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా అంగన్వాడీలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంగన్వాడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల పై ఎల్ఈడీ ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం కలెక్టర్ నిర్వహించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. అలాగే హుజురాబాద్ పట్టణంలోని ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్లో ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లో ఉన్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ముందుకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కేసీ క్యాంప్ లోని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ , డీఎం అండ్ హెచ్ఓ సుజాత, ఆర్డీవో రమేష్, సిడిపిఓ సుగుణ, తహసీల్దార్ కనకయ్య ,ఎంపీడీవో సునీత, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story