- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేరాలు చేస్తే మక్కెలు ఇరగ్గొడతా: సీఎం చంద్రబాబు సంచలన వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. మద్దిరాలపాడులో ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. వైసీపీ హయాంలో పద్ధతి లేని పరిపాలన చేశారని విమర్శించారు. జగన్ పరిపాలనలో తిరుమలలో దర్శనాలు, భోజనాలు సరిగాలేవని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదం బాగుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఛైర్మన్‌గా శ్యామలరావును నియమించామని చెప్పారు. ప్రజలు మెచ్చుకునేలా దేవుడికి సేవ చేయమని శ్యామలరావుకు సూచించానని తెలిపారు. దేవుడి ప్రసాదం అప్పుడు బాగుందా.. ఇప్పుడు బాగుందా అని ప్రశ్నించారు. గతంలో హిందువుల మనోభావాలను కించపర్చారని మండిపడ్డారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన నిందితుడులను వదలిపెట్టమంటారా? అని నిలదీశారు. ప్రకాశం జిల్లాకు వ్యక్తినే తిరుమల చైర్మన్‌గా వ్యవహించారని చంద్రబాబు తెలిపారు.
‘‘ తప్పు చేసి మాపై బురదజుల్లుతున్నారు. విజయవాడ వరదల విషయంలోనూ అలానే చేశారు. బుడమేరు మొత్తాన్ని ఆక్రమించేశారు. వరదలతో 6 లక్షల మంది బాధపడ్డారు. వరదల నుంచి బయట పడటానికి 10 రోజులు పట్టింది. ప్రకాశం బ్యారేజీని బోట్లను ఢీకొట్టాయి. నాకేం తెలియదు అని నేరస్తులు చెబుతున్నారు. బాబాయ్‌ను చంపి గుండెపోటు అని చెప్పారు. నారసురరక్త చరిత్ర అని రివర్స్‌లో బురదచల్లారు. నేరాలు చేయడం వేరేవారిపై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇక నుంచి నేరాలు చేస్తే మక్కెలు ఇరగ్గొడతా. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని అనుకుంటున్నారు. ముంబై నటిపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షిస్తాం. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టను.’’ అని చంద్రబాబు హెచ్చరించారు.