- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటవీ అధికారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
దిశ, సంగారెడ్డి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ అధికారి శ్రీనివాసరావును హత్య చేసిన గొత్తి కోయలను కఠినంగా శిక్షించాలని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో అటవీశాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస్ హత్యా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ తీశారు. అనంతరం అటవీ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలంటూ కలెక్టర్ శరత్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అడవిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ పనిలో నిమగ్నమైన అటవీ అధికారలపై దాడులు చేయడం దారుణమన్నారు.
విధి నిర్వహణలో ఉన్న ఎఫ్ఆర్వో శ్రీనివాస రావును హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునే విషయమని అన్నారు. శ్రీనివాస్ హత్య కేసును విచారించేందకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటవీ చట్టం ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ కొందరు దుర్మార్గంగా అవేమీ పట్టించుకోకుండా దాడులకు పాల్పడుతూ హత్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.