- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devulapalli Yadagiri: నాడు బిల్లులు ఇవ్వనివారే నేడు ధర్నా చేయడం సిగ్గుచేటు
దిశ, నంగునూరు: నాడు బిల్లులు ఇయ్యానోడే నేడు ధర్నా చేయడం సిగ్గుచేటని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నంగునూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తప్పెట శంకర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రి పదవులు వెలగబెట్టిన హరీష్ రావు నాడు సర్పంచులకు బిల్లులు ఇయ్యకుండా వందల మంది సర్పంచుల చావుకు కారకులు కాదా అని నిలదీశారు. మాజీ సర్పంచులను రెచ్చగొట్టి నేడు వారితో కలిసి రోడ్డు లెక్కి ధర్మాలు చేయించడం చంపినోడే తద్దినం పెట్టిన చందగా ఉందన్నారు. మాజీ సర్పంచుల బాధ ఆవేదన తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సర్పంచులతో బలవంతంగా పనులు చేయించి వారికి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసి వారి ఆత్మహత్యలకు కేసీఆర్, హరీష్ రావు కారణం కాదా అని ప్రశ్నించారు. పనులు చేయించుకుని బిల్లులు చెల్లించని ఆ ఇద్దరి నివాసాల ముందు మాజీ సర్పంచ్లు ధర్నాలు చేయాలని సూచించారు. హరీశ్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడే బిల్లులు పెండింగ్లో పెట్టారని మాజీ సర్పంచ్లకు తెలుసునని ఆర్థిక శాఖను, అధికారాన్ని చేతిలో పెట్టుకొని సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైందే హరీశ్ అని ఆరోపించారు. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు మాజీ సర్పంచులను రెచ్చగొట్టడం దివాళాకోరుతనం అని విమర్శించారు. ప్రస్తుతం సర్పంచ్‌ల పరిస్థితికి కారణమైన ఆ పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పూల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.