- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎనిమిదవ వారం మల్లన్న క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
దిశ, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లాలోని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోస్తవాలు కొనసాగుతున్న తరుణంలో ఎనిమిదవ ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర, పట్నాలు, బోనాలు, డోలు చప్పుల్లు, డమరుగ నాధలు, శివసత్తుల శిగాలు,పోతురాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకుంటాయి. సంక్రాతి నుంచి మొదలుకోని ఉగాది వరకు కొనసాగే బ్రమ్మోస్థావలలో భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అనవయితీగా వస్తుంది, 12 వారాల పాటు కొనసాగే కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, చత్తిస్‌గడ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
స్వామి వారికి మొక్కులు…
భక్తులు స్వామి వారిని క్యూలైన్లో వెళ్లి దర్శించుకున్నారు సాధారణ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. బోనాలు, ముఖమండప పట్నం, గంగరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, కేశకండన, అభిషేకం, అర్చనలు,రాతి గిరాల ప్రదక్షిణ, నిత్యకల్యాణం తదితర మొక్కలు చెల్లించుకున్నారు. ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ఈ ఓ బాలాజీ, చైర్మన్ పర్పాటకము లక్ష్మారెడ్డి, ఏఈఓలు, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, పోలీసులు జాతరను పర్యవేక్షించారు.