త్వరితగతిన అభివృద్ధి పనులను చేపట్టాలి

by Sridhar Babu |
త్వరితగతిన అభివృద్ధి పనులను చేపట్టాలి
X

దిశ,పటాన్ చెరు : పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్ లలో అభివృద్ధి పనులను త్వరితరగతిన చేపట్టాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను సూచించారు. గురువారం పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనులపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ లలో టెండర్లు పూర్తయిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పనులు చేయించాలని కోరారు. డివిజన్ల పరిధిలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను తొందరగా చేపట్టాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీనగర్, రామచంద్రాపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్, డిప్యూటీ కమిషనర్ సురేష్, సంబంధిత శాఖల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed