మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టిన కార్పొరేటర్ పుష్ప నగేష్

by Naresh |   ( Updated:2023-08-31 13:50:25.0  )
మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టిన కార్పొరేటర్ పుష్ప నగేష్
X

దిశ, పటాన్ చెరు: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావు అనుక్షణం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ అన్నలాగా సేవలందిస్తున్నారని, హరీష్ రావు సహకారంతో రామచంద్రపురం డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి హరీష్ రావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story