- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: MLA Raghunandan Rao
దిశ, దౌల్తాబాద్: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతేక పూజలు నిర్వహించి గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శక్తి కేంద్రం సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైమద్ నగర్ నుంచి తిర్మలాపూర్ మీదుగా వడ్డేపల్లి వరకు వీలైనంత త్వరగా రోడ్డు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించించారు.
టెండర్ పూర్తయిన పనుల జాప్యంపై అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనం వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించి పనులు జాప్యానికి కారణం అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ భవన పనులు వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. గ్రామంలో తన దృష్టికి తీసుకువచ్చిన 11కేవీ విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారులతో మాట్లాడి అవసరమైతే తన సొంత ఖర్చులతో 11 కేవీ విద్యుత్ తీగలను ఇళ్ల మధ్యలో నుంచి షిఫ్టింగ్ చేయిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో నిరుపయోగం ఉన్న బావిని తన సొంత ఖర్చులతో త్వరలోనే పూడ్చి వేస్తామని హామీ ఇచ్చారు. తిర్మలాపూర్ నుంచి కోనాపూర్ వెళ్లే రోడ్డు మరమ్మతులు త్వరలోనే చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావును ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కిషన్, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, రామ స్వామి గౌడ్ ,గద్దమీది స్వామి, ముత్యాల శ్రీను, భాను, సత్యనారాయణ గౌడ్, నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.