- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్దే మా లక్ష్యం: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
దిశ దౌల్తాబాద్: దుబ్బాక సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యంపెటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ముదిరాజ్, రజక సంఘం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు, పంచాయతీ భవన మరమ్మతు, రోడ్డు పనులకు, నూతన బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. సూరంపల్లి గ్రామంలో మున్నురు కాపు, ముదిరాజ్ భవనం దగ్గర బోర్ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన నాయకులు ఎటు వెళ్లారని, హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నీళ్లేవో, పాలు ఏవో తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎంపీకి, ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యా రవి జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ వెంకట్ రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ పాల రవీందర్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మి, వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, సర్పంచ్ లు అయ్యగారి నర్సింలు, శ్వేతా కనకరాజు, దౌల్తాబాద్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు ఇప్ప దయాకర్, నర సత్యం, మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ రావు, ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు పవన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.